రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా: సెల్‌ఫోన్ విషయంలో జరిగిన గొడవ ఓ తల్లి మరణానికి కారణమైంది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పోలిశెట్టి శివకుమార్‌కు భార్య మరణించడంతో పుష్ప(31)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు పుట్టాడు. శివకుమార్ మొదటి భార్యకు 18 ఏళ్ల కుమారుడు, 20 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వీరితో ఉంటున్న మొదటి భార్య కుమారుడు ప్రసాద్ ఎప్పుడూ సెల్‌ఫోన్‌తోనే ఉండ డంతో తల్లి కేకలు వేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన పుష్ప ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. గొడవ విషయం తెలిసిన భర్త ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఉరికి వేలాడుతూ ఉంది. ఆస్పత్రికి తీసు కెళ్లగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు.పుష్ప తల్లి బీరక లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని బొమ్మూరు ఎస్ఐ జగన్మోహన్ రావు పేర్కొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!