తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని టీడీపీ నేత లోకేష్ ప్రశ్నించారు. సీఏం జగన్ బ్రిటీష్ కాలం నాటీ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మద్ధతుగా నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు, సముద్రతీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపై కేసులు పెట్టడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదని విమర్శించారు. జగన్ తీరు చూస్తుంటే సముద్రం, అంతరిక్షం, భూగర్భంలో కూడా 144 సెక్షన్ పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఏపీలోనే ఎందుకు: లోకేష్
