అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ కార్యాలయం ముందు శుక్రవారం ప్రారంభించిన ఉద్యోగ జేఏసీ రిలే నిరాహార దీక్షలో పలువురు నేతలు మాట్లాడారు. ఏజెన్సీలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులను అధికారులు గుర్తించకుండా స్వల్ప కారణాలతో ఉద్యోగులను సస్పెండ్ చేయడం లేదా మెమోలు జారీ చేస్తున్నారు. ఉద్యోగులను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని, ఇకపై అటువంటి చర్యలకు స్వస్తి పలకాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని, అక్కడ సమస్యలను పరిష్కరించాలని అక్రమ బదిలీలు, పదోన్నతులను అరికట్టాలని కోరారు. గిరిజన ఉద్యోగుల పట్ల అధికారుల తీరుమారకుంటే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు ఆర్.జగన్మోహనరావు, కె.దేముళ్లనాయుడు, ముఖి శేషాద్రి, బి.సింహాచలం, ముఖి రామకృష్ణ, కోడా సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!