*దేశంలోనే ఆదర్శ పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ది : ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
నందిగామ పట్టణంలోని ఆర్.యస్ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండల గృహ సారథులు – బూత్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాట్లాడుతూ
నిత్యం ప్రజల మధ్యే ఉన్నాం.. ప్రజా మద్దతు మనకే ఉందని ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి.. ఓటర్ లిస్ట్ లపై పూర్తి పట్టు సాధించి, క్షేత్రస్థాయిలో ఓటర్ లిస్టులను పరిశీలించాలి అని తెలిపారు.
బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లు, డెత్ ఎంట్రీ ఓట్లు ను గుర్తించి బూతు లెవెల్ ఆఫీసర్లకు అందజేయాలి.. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు చర్యలు తీసుకోవాలన్నారు.
కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మంచి చేశాం.. మంచి చేసిన వారిని ప్రజలు గుర్తుంచుకుంటారు అని చెప్పారు.
చంద్రబాబు నాయుడి లా అబద్దాల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేదు, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చామని,
తెలుగుదేశం పార్టీ అవినీతికి, దోపిడీకి కేరాఫ్ అడ్రస్ లుగా మారాయి.. చంద్రబాబు ప్రతి పనిలోను స్కాం లకు పాల్పడి ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .
This post was created with our nice and easy submission form. Create your post!