in ,

నేడు ఎస్టీ నేత‌ల‌తో ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యులు స‌మావేశం

పాడేరు సెప్టెంబ‌రు 21 :  జాతీయ ఎస్టీ క‌మీష‌న్ స‌భ్యులు అనంత‌నాయ‌క్  ఈనెల 22 వ తేదీన  మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు స్థానికి పి ఎం ఆర్‌సి భ‌వ‌నంలో స్థానిక గిరిజ‌న నేత‌ల‌తో స‌మావేశ మ‌వుతార‌ని ఐటిడి ఏ  పి ఓ   వి. అభిషేక్ గురువారం  తెలియ‌జేసారు. గిరిజ‌న ప్రాంతంలో ఉన్న స‌మ‌స్య‌లుపై చ‌ర్చిస్తార‌ని చెప్పారు. గిరిజ‌న నేత‌లు  హాజ‌రై ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యుల‌తో ముచ్చ‌టించాల‌ని   సూచించారు.

ఈనెల 22, 23 తేదీల‌లో ఏజెన్సీ ప‌ర్య‌ట‌న‌

జాతీయ ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యులు   ఈనెల 22, 23 తేదీల‌లో పాడేరు డివిజ‌న్ లో ప‌ర్య‌టించనున్నారు. పర్యటన సాగేది ఇలా……..22 వ తేదీన ఉద‌యం 9.30 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నంలో బ‌య‌లు దేరి 12 గంట‌ల‌కు పాడేరు పి. ఎం. ఆర్‌.సి భ‌వ‌నానికి చేరుకుంటారు. 12.20 గంట‌ల‌కు బ‌య‌లుదేరి శ్రీ‌కృష్ణాపురం బాలిక‌ల ఆశ్ర‌మ పాఠ‌శాల‌ను సంద‌ర్శిస్తారు.  అక్క‌డ ఏర్పాటు చేసిన జిసిసి, కాఫీ, విడివికె స్టాల్స్‌ను సంద‌ర్శిస్తారు. గిరిజ‌న రైతుల‌కు అట‌వీ హ‌క్కు ప‌త్రాలు పంపిణీ చేస్తారు.  అనంత‌రం పాడేరు పి ఎం ఆర్ సి భ‌వ‌నానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు స్థానిక గిరిజ‌న నేత‌ల‌తో  స‌మావేశమ‌వుతారు. 2.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి  మెడిక‌ల్ క‌ళాశాల నిర్మాణ‌పు ప‌నులు ప‌రిశీలిస్తారు.  ఆత‌రువాత  కుమ్మ‌రిపుట్టు లో ఉన్న గురుకుల పాఠ‌శాల‌, ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌ల‌ను  సంద‌ర్శిస్తారు. మ‌.3.45 గంట‌ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి చేరుకుని జిల్లా అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తారు. అనంత‌రం  పి.ఎం. ఆర్ . సి .భ‌వ‌నానికి చేరుకుని రాత్రి బ‌స చేస్తారు.

 ఈనెల 22, 23 తేదీల‌లో ఏజెన్సీ ప‌ర్య‌ట‌న‌

జాతీయ ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యులు  ఈనెల 22, 23 తేదీల‌లో పాడేరు డివిజ‌న్ లో ప‌ర్య‌టించనున్నారు.

22 వ తేదీన ఉద‌యం 9.30 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నంలో బ‌య‌లు దేరి 12 గంట‌ల‌కు పాడేరు పి. ఎం. ఆర్‌.సి భ‌వ‌నానికి చేరుకుంటారు. 12.20 గంట‌ల‌కు బ‌య‌లుదేరి శ్రీ‌కృష్ణాపురం బాలిక‌ల ఆశ్ర‌మ పాఠ‌శాల‌ను సంద‌ర్శిస్తారు.  అక్క‌డ ఏర్పాటు చేసిన జిసిసి, కాఫీ, విడివికె స్టాల్స్‌ను సంద‌ర్శిస్తారు. గిరిజ‌న రైతుల‌కు అట‌వీ హ‌క్కు ప‌త్రాలు పంపిణీ చేస్తారు.  అనంత‌రం పాడేరు పి ఎం ఆర్ సి భ‌వ‌నానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు స్థానిక గిరిజ‌న నేత‌ల‌తో  స‌మావేశమ‌వుతారు. 2.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి  మెడిక‌ల్ క‌ళాశాల నిర్మాణ‌పు ప‌నులు ప‌రిశీలిస్తారు.  ఆత‌రువాత  కుమ్మ‌రిపుట్టు లో ఉన్న గురుకుల పాఠ‌శాల‌, ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌ల‌ను  సంద‌ర్శిస్తారు. మ‌.3.45 గంట‌ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి చేరుకుని జిల్లా అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తారు. అనంత‌రం  పి.ఎం. ఆర్ . సి .భ‌వ‌నానికి చేరుకుని రాత్రి బ‌స చేస్తారు.

23 వ తేదీన  ఉద‌యం 8 గంట‌ల‌కు బ‌య‌లుదేరి  మ‌ఠం గ్రామంలో ఉన్న  వ‌న‌వాసి క‌ళ్యాణ  ఆశ్ర‌మంలో అల్పాహారం చేస్తారు. 9 గంట‌ల‌కు బ‌య‌లు దేరి   గుత్తుల పుట్టు  ప్ర‌భుత్వ గిరిజ‌న సంక్షేమ ఆశ్ర‌మ బాలిక‌ల పాఠ‌శాల లేదా ఉప్ప  గిరిజ‌న సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల‌ను  సంద‌ర్శిస్తారు.  అక్క‌డ నుండి బ‌య‌లు దేరి డుంబ్రిగుడ ఏక‌ల‌వ్య మోడ‌ల్  రెసిడెన్సియ‌ల్ స్కూలు పాఠ‌శాల భ‌వ‌న నిర్మాణాల‌ను ప‌రిశీలిస్తారు. మ‌ధ్యాహ్నం  11.10 గంట‌ల‌కు  కిల్లోగుడ  ఆశ్ర‌మ పాఠ‌శాల‌( ఇంగ్లీషు మీడియం)ను సంద‌ర్శిస్తారు.  11.45 గంట‌ల‌కు ప‌ద్మాపురం గార్డెన్     చేరుకుంటారు.  మ. 12.20 గం.ల‌కు గిరిజ‌న మ్యూజియంను సంద‌ర్శిస్తారు.మ‌. 1 .00 గంట‌కు  అర‌కు వ్యాలీ ఎపిటిడిసికి చేరుకుని భోజ‌నం అనంత‌రం విశాఖ‌ప‌ట్నం బ‌య‌లుదేరి వెళ‌తారు..

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

నీతి ఆయోగ్ ఆకాంక్ష‌త్మ‌క బ్లాక్‌ఫెలో ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్త‌లు ఆ

గంగపుత్ర సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ