in ,

నీతి ఆయోగ్ ఆకాంక్ష‌త్మ‌క బ్లాక్‌ఫెలో ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్త‌లు ఆ

పాడేరు సెప్టెంబ‌రు 21 : నీతి  ఆయోగ్  ఆకాంక్షాత్మ‌క బ్లాక్‌ఫెలో ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్  గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.  ఏదైనా పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాల‌ని పేర్కొన్నారు.  ఎంపికైన  అభ్య‌ర్దులకు నెల‌కు  రూ.55 వేలు  నిర్దిష్ట‌మైన వేత‌నంతో తాత్కాలిక ప్రాతిప‌ధిక‌న నియ‌మించ‌డం జ‌రుగుతుంద‌ని   స్ప‌ష్టం చేసారు.  ఎంపికైన అభ్య‌ర్దులు  వై.రామ వ‌రం, మారేడుమిల్లి,  గంగ‌వ‌రం మండ‌లాల్లో  విధులు నిర్వ‌హించ వ‌ల‌సి ఉంటుంద‌న్నారు. అర్హ‌త‌లు , ఆస‌కి్త క‌లిగిన అభ్య‌ర్దులు  ఈనెల 28 వ తేదీలోపు   క‌లెక్ట‌ర్ కార్యాల‌యం అల్లూరి సీతారామ రాజు జిల్లా, కుమ్మ‌రిపుట్టు, పాడేరు మండ‌లం లో ఉన్న  జిల్లా అర్ధ గ‌ణాంక అధికారి  వారి కార్యాల‌యానికి  పోస్టు ద్వారా గాని స్వ‌యంగా గానికి ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని సూచించారు. పూర్తి వివ‌రాల‌ను అల్లూరి సీతారామ‌రాజు జిల్లా  అధికారిక వెబ్‌సైట్ https://allurisitharamaraju.ap.gov.in  లో పొందు ప‌ర‌చ‌డం జ‌రిగింద‌న్నారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా అర్ధ‌గ‌ణాంక అధికారి నోటీసు బోర్డులో ప్ర‌చురించ‌డం  జ‌రిగింద‌ని చెప్పారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

రేపటి పెద‌బ‌య‌లు స్పంద‌న ర‌ద్దు

నేడు ఎస్టీ నేత‌ల‌తో ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యులు స‌మావేశం