డెంకాడ మండలం పినతాడివాడ, గునుపూరు గ్రామాల్లో అతిసారం విజృంభిస్తోంది. ఇప్పటికే సుమారు 40 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. పారిశుద్ధ్య లోపం, తాగునీరు కలుషితం కావడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
రెండు గ్రామాల్లో సోమవారం ఉదయం నుంచి పలువురిక ఉన్నటుండి వాంతులు విరేచనాలు కావడంతో డెంకాడు.రెండు గ్రామాల్లో సోమవారం ఉదయం నుంచి పలువురికి ఉన్నట్టుండి వాంతులు, విరేచనాలు కావడంతో డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. వారికి ప్రాథమిక వైద్యసేవల అనంతరం కొందరిని విజయనగరం రిఫర్ చేశారు. సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గునుపూరు వాసి పోతుబార్కి అప్పల పైడితల్లి (42) సోమవారం ఉదయం మరణించారు. పినతాడివాడలో నివాసముండే ఆవాల గంగమ్మ (75) ఆదివారం రాత్రి చనిపోయారు. మంగళవారం సైతం మరికొందరు తీవ్ర లక్షణాలతో డెంకాడ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పడకలు సరిపోకపోవడంతో పలువురు రోగులు విజయనగరం వెళ్లారు. సర్వజన ఆసుపత్రితో పాటు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు.
అప్రమత్తమైన యంత్రాంగం : ఈ పరిస్థితితో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. స్థానిక సిబ్బంది సమాచారం మేరకు డీఎంహెచ్ వో భాస్కరరావు మంగళవారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కలుషిత నీరు కారణంగానే వ్యాధి సోకినట్లు గుర్తించామని, నమూనాలు సేకరించి, పరీక్షించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను కోరినట్లు చెప్పారు
[zombify_post]