డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (జగనన్నకు చెబుదాం) కార్యక్ర మంలో అందిన వినతులను, అర్జీ దారుల సంతృప్తే ధ్యేయంగా నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మండల స్థాయిలో వారంలో రెండు చోట్ల జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా బుధవారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మండల పరిధిలో ఉన్న సమస్యలపై అర్జీదారులు రాతపూర్వకంగా స్పందన, (జగనన్నకు చెబుదాం) కార్యక్రమం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు కోరాలని సూచించాడు, మండల పరిధిలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివా దాలు తదితరాల సమస్యలకు సంబం ధించి సుమారుగా 39 అర్జీలు అందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కార మార్గాలు సంతృప్తికర స్థాయిలో చూపాలని ఆమె స్పష్టం చేశారు. ఆర్జీదారులలో సంతృప్తి స్థాయితో పాటుగా స్పందన కార్యక్రమ నిర్వహించిన తీరు పట్ల విశ్వసనీ యతను పెంచడానికి నిర్ణీత కాల వ్యవధిలో వినతులను పరిష్కరించి గడువు దాటిన అర్జీలు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా అర్జీలు రీఓపెన్ అయ్యే అవకాశం రానివ్వ కుండా సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఓ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ రాజ్ ఎస్ ఇ లు ఎన్ వి కృష్ణారెడ్డి, కే చంటిబాబు ఆర్డీవో ఎం ముక్కంటి, తాసిల్దార్ జి డి కిషోర్ బాబు, ఎంపీడీవో మధుసూదన రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కే ప్రభాకరరావు, డి ఎల్ డి వో ప్రభాకర్ రావు డిపిఓ వి. కృష్ణకుమారి పౌరసరఫరాలు జిల్లా మేనేజర్ ఎస్ సుధా సాగర్ డీఎస్ ఏ పాపారావు డి ఆర్ డి ఎ పి డి వి శివశంకరప్రసాద్ ద్వామా పిడి ఎస్ మధుసూదన్ జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి సిహెచ్ బాబురావు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికా రులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
