పాడేరు సెప్టెంబరు 20 : ప్రభుత్వ సర్వీసు లో ఉండగా వివిద కారణాలతో మృతి చెందిన కుటుంబాల వారసులు తొమ్మిది మంది కి కారుణ్య నియామక ఉత్తర్వులను అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఆయన కార్యాలయంలో జారీ చేసారు. 9 మందికి రెవెన్యూ శాఖలో ఉద్యోగులుగా నియమించారు. ఎస్. దిలీప్ కుమార్, డి. వెంకట సాయి కార్తిక్, జి.మనోజ్ కుమార్, ఎల్. చక్రధర్‌లను
0 జూనియర్ అసిస్టెంట్లుగాను, సి.హెచ్. వెంకట కృష్ణ ప్రసాద్, సి.హెచ్. అర్చన ప్రియ, ఎస్.కృపావతి, బి.రవికుమార్‌లకు టైపిస్టులుగాను, డి. మహేశ్వరిని ఆఫీసు సబార్డినేట్‌గా రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు కల్పించారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు.
[zombify_post]