in ,

పనులు వేగవంతం గా పూర్తి చేయాలి

పాడేరు సెప్టెంబ‌రు 19 :  గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంలో చేప‌ట్టిన ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని జిల్లా  క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.  మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో పంచాయ‌తీ రాజ్‌,గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగం ఇంజ‌నీర్లు, పాడేరునియోజ వ‌ర్గం ప‌రిధిలోని ఎంపిడి ఓలు, ఎంపిపిలు,  ఎపిటిసిలు, స‌ర్పంచుల‌తో  స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  పంచాయ‌తీ రాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ద్వారా 58ప‌నులు పూర్తి చేసి  రూ. 1 కోటి 35 ల‌క్ష‌ల బిల్లులు చెల్లించామ‌న్నారు. 119 నులు పురోగ‌తిలో ఉన్నాయ‌ని చెప్పారు.  నీటి స‌ర‌ఫ‌రా విభాగం ప‌రిధిలో 19 ప‌నుల‌ను పూర్తి చేసి రూ.47 ల‌క్ష‌ల 65 వేల బిల్లుల‌ను చెల్లించామ‌ని స్ప‌ష్టం చేసారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కింద ప్ర‌తీ పంచాయ‌తీలో  రూ.40 ల‌క్ష‌ల విలువైన ప‌నులు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. మంజూరు చేసిన ప‌నుల‌ను నిర్దేశించిన గ‌డువులోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.  ప‌నులు పూర్తి చేస్తే వెంట‌నే బిల్లులు విడ‌ద‌ల చేస్తామ‌ని చెప్పారు. ప‌నుల‌పై స‌ర్పంచులు  నిఘాపెట్టి స‌కాలంలో పూర్తి చేసే విధంగా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. రూ.5 ల‌క్ష‌ల విలువైన ప‌నుల‌కు నామినేష‌న్ విధానంలో ప‌నులు చేయాల‌ని చెప్పారు. రూ.5 ల‌క్ష‌ల పైబ‌డిన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచి ప‌నులు చేయాల‌ని అన్నారు.  బిల్లులు ఎక్క‌డా ఆప‌డం లేద‌ని చెప్పారు. బిల్లులు చెల్లింపులులో జాప్యం లేకుండా చెల్లిస్తామ‌న్నారు. ప్రాధాన్య‌త‌,ప్రాధాన్యేత‌ర ప‌నులు వేగంగా పూర్తి  చేయాల‌ని చెప్పారు.  తాగునీటి ప‌థ‌కాలు వేగంగాపూర్తి చేసి తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. ప‌నులు చేయ‌డానికి బ‌య‌ప‌డొద్ద‌ని బిల్లులు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసారు.
పాడేరు శాస‌న స‌భ్యురాలు కొట్ట‌గుళ్లి భాగ్య ల‌క్ష్మి  మాట్లాడుతూ నియోజ‌క వ‌ర్గం  ప‌రిధిలో  97 స‌చివాల‌యాల‌లో 85 స‌చివాల‌యాల‌ను పూర్తి చేసార‌ని చెప్పారు. మిగిలిన 12 త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. గ్రామాల్లో తాగునీటి ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని సూచించారు. అధికారులు మండ‌ల స‌ర్వ‌స‌భ్య స‌మావేశాల‌కు హాజ‌రు కావ‌డం లేద‌ని క‌లెక్ట‌ర్ దృష్టికి  తీసుకుని వ‌చ్చారు. భ‌వ‌నాలు లేని పాఠ‌శాల‌ల‌కు భ‌వ‌న నిర్మాణాల‌కు, వాలంటీర్ల నియామ‌కాల‌కు  ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించ‌డం జ‌రిగింద‌న్నారు.
ఈ స‌మావేశంలో   ఐటిడి ఏ పిఓ  వి. అభిషేక్‌, పంచాయ‌తీ రాజ్ ఇ ఇ టి.కొండ‌య్య ప‌డాల్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగం ఇ ఇ  లీలా క్రిష్ణ‌, పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగం డి. ఇలు, ఎ ఇ ఇలు,  ఐదు మండ‌లాల ప‌రిధిలో ఎంపిపిలు, ఎంపిటిసిలు, స‌ర్పంచులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

శభాష్…. సీఐ సుధాకర్

సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు – నారా లోకేష్