రాజోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో కృషి చేస్తున్నట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు అన్నారు.
మలికిపురం మండలం కేశనపల్లిలో కేశవదాసు పాలెం నుండి కరవాక వరకూ 4కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నూతన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి ముఖ్యనాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]