హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ:ఏసీబీ కోర్టు రిమాండ్ ఆదేశాల పైన చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. అసలు ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని వాదించారు. అదే సమయంలో రిమాండ్ రివ్యూ పిటీషన్ కూడా కోర్టులో దాఖలైంది. దీంతో పాటుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు పైన సీఐడీ అప్పట్లోనే ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
ఈ కేసులో సీఐడీ పీటీ వారెంట్ కోసం ప్రయత్నిస్తోందనే వార్తల నేపథ్యంలో చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఈ వ్యవహారంలో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. వీటి పైన సీఐడీని కౌంటర్ దాఖలు చేయాని ఆదేశించిన హైకోర్టు ఈ రోజుకు కేసు విచారణ వాయిదా వేసింది. సీఐడీ కౌంటర్ లో ఏ అంశాలు ప్రస్తావిస్తుందీ..ఆ తరువాత కోర్టు నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

బెయిల్ పిటీషన్ పై విచారణ:ఇదే సమయంలో ఈ రోజు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది. చంద్రబాబుకు రెగ్యులర్, మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో దాఖలైన పిటీషన్లను న్యాయస్థానం ఈ రోజు విచారణకు నిర్ణయించింది. ఇదే సమయంలో చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ పైన హైకోర్టులో క్వాష్, రిమాండ్ రివ్యూ పిటీషన్ పైన నిర్ణయానికి అనుగుణంగా ఏసీబీ కోర్టు తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబు బెయిల్ పైన ఏసీబీ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ రోజు అటు హైకోర్టు, ఇటు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసే కౌంటర్లు.. వినిపించే వాదనల తరువాత చంద్రబాబు పిటీషన్లపైన న్యాయస్థానాల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్ దక్కేనా..ఏం జరిగుతుందనే అంశంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన బయటకు రావాలని కోరుకుంటూ ఆలయాలకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్, హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
ఇక విజయవాడలోని మాచవరం దేవాలయానికి వెళ్లడానికి ప్రయత్నం చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టిడిపి నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొల్లు రవీంద్ర ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో, ఆయన పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్లడానికి కూడా పోలీసులు అనుమతి కావాలా అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా లేక రాజారెడ్డి రాజ్యాంగమా అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, అరెస్ట్ లతో ఏపీలో గందరగోళం నెలకొంది.
[zombify_post]