విజయవాడ కనకదుర్గమ్మ గుడి లో కొబ్బరికాయలు కొట్టేందుకు, చంద్రబాబు బయటికి రావాలని కోరుకునేందుకు గుడికి బయలుదేరిన బుద్ధ వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో టిడిపి నేత బుద్ధ వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టేందుకు బయలుదేరిన టిడిపి నేతలు బుద్ధ వెంకన్నను అరెస్ట్ చెయ్యటంతో టిడిపి నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.బుద్ధ వెంకన్న ను అరెస్ట్ చేయడానికి గల కారణం చెప్పమని టిడిపి నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు, పోలీసుల జీపు లకు వారి వాహనాలను అడ్డుపెట్టి మరీ నిరసన వ్యక్తం చేశారు. దుర్గ గుడికి వెళ్లి రావడానికి పోలీసుల అనుమతి కావాలా అంటూ టిడిపి నేతలు, బుద్ధ వెంకన్న వారిని ప్రశ్నించారు.
[zombify_post]