
in Main News
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి

ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నూట యాభై రూపాయలు పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధరపై రూ.200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 55,050 రూపాయలుగా నమోదయి ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,080 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్ లో 78,200 రూపాయలుగా కొనసాగుతుంది.

