
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం లోక్సభలో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కేవలం రాజకీయ పగతో జరిగిందని, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బ్లాక్ డే అని అభివర్ణించారు.చంద్రబాబు నాయుడును బేషరతుగా వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.