సోమవారం మరోసారి జైల్లో ఉన్న చంద్రబాబు ను ఆయన సతీమణి భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ఆమెతో పాటు కోడలు నారా బ్రాహ్మణి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిశారు. ఆదివారం కూడా సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ (Ex-MD of Siemens) ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు తెలిపారు. అయినప్పటికీ వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ((Nara Brahmani)) ఆగ్రహం వ్యక్తం చేసారు.
