కాంగ్రెస్ ది మాటల ప్రభుత్వం, బీ ఆర్ ఎస్ ది చేతల ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 4వేల పెన్షన్ ఇస్తున్నారా. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా పథకాలు ఏ ఒక్కటైన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా. అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ఈ రాష్ట్ర ప్రజల నమ్మరు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రైతు రుణమాఫీ అని ప్రకటించినా, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటనకు పట్టం కట్టారు. అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.