మీడియా ముందుకు రాజకీయంగా వచ్చి, మాటల తూటాలు పేలుస్తున్నారు బ్రాహ్మణి. అంతేకాదు.. మీడియాతో మాట్లాడే సమయంలోనే కాకుండా.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. నిర్వహించిన కార్యక్రమాల్లోనూ బ్రాహ్మణి పాల్గొన్న తీరు పార్టీలో ఉత్సాహం నింపుతున్నాయి. టీడీపీ ఒంటరి కాదని, రాష్ట్ర ప్రజలే పార్టీ కుటుంబమని నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి.