ఈసారి గణపతి పండగ 18,19 తేదీల్లో వచ్చింది. పండితుల సలహా మేరకు 18న పండగ ప్రారంభం కానుంది.
గణపతి ని ఇంటికి ఏ సమయంలో తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 18న ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు మంచి ముహూర్తం ఉంది. ళ్లీ మధ్యాహ్నం 12:39 నుంచి మరుసటి రోజు 19 రాత్రి 8:43 వరకు ఉంది. ఈ గడియల్లో వినాయకుడిని ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్టించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
అలాగే స్వామివారి పూజకు సంబంధించి వినాయక చవితి రోజు స్వామివారికి పత్రితో పూజిస్తాం.. అయితే తులసీదళాన్ని అసలు స్వామివారికి సమర్పించకూడదు.. వినాయక పూజలో తులసీదళం అనేది నిషిద్ధం సాధ్యమైనంత వరకు గరిక, మహాగణపతికి చాలా ప్రీతి కాబట్టి గరికను గణపతికి సమర్పించండి. తులసిని పూజలో నిషేధించండి. వినాయక చవితి రోజు పొరపాటున కూడా చంద్రుని చూడకూడదు.