సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మామిళ్లకుంట క్రాస్ వద్ద సీపీఐ మావోయిస్టు పశ్చిమ కనుమల ప్రత్యేక జోన్ జిల్లా కమిటీ సభ్యురాలు మురువపల్లి రాజి అలియాస్ సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడులోని ట్రై జంక్షన్ ప్రాంతాల్లో మావోయిస్టులు జరిపిన అనేక కార్యకలాపాలకు ఆమె చీఫ్ ఆర్కిటెక్ట్ అని భావిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ మాధవ రెడ్డి తెలిపారు.