ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థను 2015 నుంచి అభివృద్ధి చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 21, 22 తేదీల్లో ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను భారత ఆర్మీ కోసం కొనేందుకు చేసిన ప్రతిపాదనలకు రక్షణ శాఖ ఆమోద ముద్ర వేసింది. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదిస్తాయి. తాజాగా జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
