గోమయ గణేష్ ప్రతిమలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, పర్యావరణహిత గోమయ, మట్టి, గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని క్లిమామ్ సంస్థ, ఐకేఆర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గోమయ వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పర్యావరణానికి మేలు చేయాలంటే మట్టి, గోమయ గణపతి ప్రతిమలను ప్రతిష్టించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో తీవ్ర జల కాలుష్యం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నిర్మల్ నియోజకవర్గంలో ప్రతీ ఏటా క్లిమామ్ సంస్థ, ఐకేఆర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఉచిత గోమయ గణపతులను పంపిణీ చేస్తున్న అల్లోల గౌతంరెడ్డి, సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
[zombify_post]