డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
దళిత హాక్కులన్ని- మానవ హక్కులే దళిత హక్కులన్ని మానవ హక్కులే అని అంతర్జాతీయ వేదికలపై చాటిన మానవతవాది బొజ్జా తారకం అని ప్రముఖ సీనియర్ న్యాయవాది సయ్యద్ సాలర్ పేర్కొన్నారు.ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక తాడి తాతారావు కళ్యాణ మండపం నందు భారత రిపబ్లికన్ పార్టీ నాయకుడు పెనుమాల సుధీర్ అధ్యక్షతన బొజ్జా తారకం 7వ వర్ధంతి సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ న్యాయవాది సాలర్ తొలుత మహాత్మా జ్యోతిరావు ఫూలే, రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్ అంబేడ్కర్ మరియు హక్కుల పోరాట యోధుడు,కవి,రచయిత,పత్రికా సంపాదకుడు,న్యాయవాది బొజ్జా తారకం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తారకం దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై దళిత హక్కుల పై చర్చించేవారన్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలోని దర్పన్ సమావేశంలో మానవ హక్కుల యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ,ప్రభుత్వ న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా త్యాధించి ప్రజాపోరాటంలో ప్రజల పక్షాన నిలిచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగే అనేక ఎన్ కౌంటర్ల లో ప్రజలకు దైర్యం చెప్పేందుకు పోలీసులు అరెస్టు చేస్తే ఏం చెయ్యాలి అనే నవలను రచించి ప్రతి పౌరుడికి ధైర్య సాహసాలు అందించారన్నారు.అప్పట్లో ఈ నవల లక్షా కాపీలను సామాన్యులు సైతం కొనుగోలు చేయడంతో, ప్రభుత్వం పోలీసులతో 30 వేల కాపీలను కొనుగోలు చేసి దహనం చేయించారంటే ఆ నవల లోనే ఆయన గొప్ప మేధస్సు ఏమిటో అర్ధం అవుతుందన్నారు.అలాగే ఎన్ కౌంటర్ లో జరిగే ఎఫ్ఐఆర్,చార్జిషీట్, విచారణ వంటి ప్రక్రియలకు కాలాతితం అవుతున్న సమయంలో ప్రజల్లోనే కొన్ని వర్గాల వ్యక్తులను ఎంచుకుని నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసి, ఎంతో సునాయాసంగా కీలకమైన కేసులను సులభంగా పరిష్కరించే వారు.దీనితో పాటు తారకం రచించిన నదీ పుట్టుక, నలుపు, చరిత్ర మెచ్చిన మనిషి వంటి నవలలు విశేష ప్రజాదరణ పొందాయి.ఇంత గొప్ప మహనీయుడు కోనసీమలో జన్మించడం ఈ ప్రాంత వాసుల అదృష్టం అని సాలార్ కొనియాడారు. అంతే కాకుండా ఈ డెల్టా ప్రాంతంలో సుమారు 4 లక్షల ఎకరాలలో దళిత బిడ్డలైన మన తల్లి,చెల్లి, బిడ్డల యొక్క కష్టార్జితం దాగి ఉందని తారకం పోరాటాల ద్వారా పీడిత జాతులకు తెలిపారన్నారు. జాతీయోద్యమ సమయంలో హిందూ,ముస్లిం మతోన్మధ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా డా. అంబేడ్కర్ దృఢమైన, సెక్యులర్ రాజ్యాంగాన్ని అందించడం గొప్ప వరం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముందు బుద్ధ పార్కు అవరణ లోని తారకం నిలువెత్తు విగ్రహానికి పలువురు అధికారులతో పాటు పెనుమల సుధీర్ సామాజిక కార్యకర్త పచ్చిమాల బాబ్జీ పెయ్యిల పరశురాముడు ముంగండ ఆశీర్వాదం జనిపల్లి సత్యనారాయణ దుక్కిపాటి సూర్యనారాయణ నల్లా సూర్య ప్రకాష్ శరత్ కాశి సత్యనారాయణ మూర్తి సింహాద్రి వర్యా బడుగు సత్యనారాయణ పూలమాలలు వేశారు.ఈ కార్యక్రమంలో మట్టా వెంకట్రావ్, పెనుమాల చిట్టిబాబు ఐ ఎన్ మల్లేశ్వరరావు వడ్డీ నాగేశ్వర రావు గిడ్ల వీర ప్రసాద్ సఖిలే పృథ్వీరాజ్ అయితాబత్తుల పండుబాబు సాగర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.
[zombify_post]
