in ,

విజయభేరి సభలో కాంగ్రెస్ ఆరు ఎన్నికల హామీల ప్రకటన

  • కాంగ్రెస్‌ విజయభేరి సభకు సోనియా-ఆరు ఎన్నికల హామీల ప్రకటన

  • విజయభేరి సభను సిద్ధమైంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. తుక్కుగూడ జరగనున్న ఈ సభకు సోనియాగాంధీ హాజరుకానున్నారు. సభా వేదికపై నుంచి ఆరు ఎన్నికలను హామీలను ఆమె ప్రకటించానున్నారు.

హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించబోతున్న విజయభేరి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. ఈనెల 17న.. అంటే ఆదివారం  తుక్కగూడలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సభా వేదికకగా సోనియాగాంధీ ఆరు  గ్యారెంటీల పేరుతో ఎన్నికల హామీలు ప్రకటిస్తారని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. తుక్కుగూడలో విజయభేరి సభ ఏర్పాట్లను పరిశీలించారు కేసీ  వేణుగోపాలు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్‌ ఉన్నారు.

తుక్కగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్‌ నేతలు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న హామీని సోనియా గాంధీ  నిలబెట్టుకున్నారని అన్నారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో జాతీయత ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్రంలోనూ మోడీ,  తెలంగాణలో కేసీఆర్‌ అరాచక పాలన కొనసాగిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్‌ కూడా ఆరోపించారు. భారత్‌ జోడోయాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఏర్పడిందని.. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అవినీతి పాలనను అంతమొందిస్తామని అన్నారు.

మధ్యాహ్నం 2గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమవుతుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీడబ్ల్యూసీ మీటింగ్‌ను మొదటిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు  చెప్పారాయన. నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలతో సహా 90 మంది ఈ సమావేశానికి హాజరవుతారని ప్రకటించారు. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత తెలంగాణా రాజకీయాల్లో  పెను మార్పులు జరుగుతాయన్నారు. ఆదివారం ఉదయం 10గంటల 30 నిమిషాలకు ఎక్స్‌టెండెడ్‌ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని.. ఆ తర్వాత సాయంత్రం  5గంటలకు తుక్కుగూడ గ్రౌండ్‌లో విజయభేరి బహిరంగ సభ ఉంటుందన్నారు. ఆ సభలో తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటిస్తారని స్పష్టం  చేశారు.

తుక్కుగూడ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా వేదికతోపాటు మరో రెండు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు  తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు స్టేజీల పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించేది లేదని చెప్తున్నారు. మరోవైపు.. 10లక్షల మందితో సభ  నిర్వహించాలని కాంగ్రెస్‌ భావించింది. కానీ… సభకు వచ్చేవారు 10వేల మందికి మించకూడదని పోలీసులు కండిషన్‌ పెట్టారు. అంతేకాదు.. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి  9గంటల వరకు మాత్రమే సభ నిర్వహించుకోవలన్నారు. ఒకే బాక్స్‌ స్పీకర్‌ ఉపయోగించాలని..  55 డీబీ కంటే తక్కువ శబ్ధం ఉండాలని.. డ్రోన్లు వాడకూడదని… రెచ్చగొట్టే  వ్యాఖ్యలు చేయొద్దని షరతులు విధించారు. పోలీసులు పెట్టిన ఈ కండీషన్లపై కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

ప్రజల గుండెల్లో గులాబీ జెండా….

రాష్ట్ర ప్రయోజనాలకే పొత్తు: జనసేన