బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఏర్పడనుంది ఐఎండీ తెలిపింది.ఫలితంగా కొన్ని జిల్లాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. వచ్చే రెండ్రోజులు ఏపీలోని విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
