Balakrishna: చంద్రబాబు అరెస్టు, రిమాండ్ వ్యవహారంతో జనంలో ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ తెరపైకి వచ్చి మీడియాతో చాలా విషయాలు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం అనేదే లేదని..కేవలం సృష్టించారని, 16 నెలలు జైలులో ఉన్న జగన్..చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో ఉంచాలనే, రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పరిణామాలు తట్టుకోలేక మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. అంతేకాదు..ఆ కుటుంబాల్ని త్వరలో పరామర్శిస్తానని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని కలుస్తానన్నారు. మీ అందరి కోసం నేనున్నానని..మీ వద్దకు వస్తానని చెప్పారు.