-
కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
-
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి.
సెప్టెంబరు 17 వ తేదిన హైదరాబాదు తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి పెద్దసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్ళాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం స్ధాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వంటి నాయకులతో పాటు అనేక మంది జాతీయ నాయకులు ఈ సభలో పాల్గొంటారని అన్నారు.
సూర్యాపేట నియోజకవర్గం నుండి ఇరవై వేల మంది సభకు రావాలని అన్నారు. ప్రతి గ్రామంనుండి యాభై మంది సభకు బయలుదేరాలని, సూర్యాపేటకు ఉదయం 11 గంటల వరకు చేరుకోవాలని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, సూర్యాపేట నియోజకవర్గం నుండి యాభై వేల మెజారిటీతో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ఆయన అన్నారు.పదిలక్షల మందితో జరిగే తుక్కుగూడ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ లను ఈ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రాజా, గోదాల రంగారెడ్డి, శనగాని రాంబాబు, వడ్డె ఎల్లయ్య, ముదిరెడ్డి రమణారెడ్డి, కౌన్సిలర్ లు వెలుగు వెంకన్న, నామా ప్రవీణ్, వల్దాస్ దేవేందర్, రమేష్ నాయుడు,ఫరూక్, సైదిరెడ్డి,స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]