డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
మండపేట జోనల్ ప్రవేటు పాఠశాలల మేనేజ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎంపికైన ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్ అధినేత ఉమారాణికి అభినందనలు వెల్లువెత్తున్నాయి.పది మండలాల పరిధిలో గల పాఠశాలలకు సంబంధించిన ఈ అధ్యక్ష పదవి అందుకోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం స్వయంగా కలిసి ఉమారాణిని అభినందిస్తున్నారు. చెముడులంక సర్పంచ్, మండల వైకాపా అధ్యక్షులు తమ్మన శ్రీనివాస్, వైకాపా రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చల్లా ప్రభాకరరావులు షిర్డీ సాయి స్కూల్ కు వెళ్ళి ఉమారాణిని సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమెకు అభినందనలు తెలిపారు.
[zombify_post]
