- *పట్టణ ప్రాంతాల్లోని పురాతన దేవాలయాలను
కూడా డిడిఎన్ స్కీములో చేర్చండి*అలాగే వేదపండితుల ఉద్యోగాలు కూడా పెద్దమనసు తో భర్తీ చేయండి .. తో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ
కర్నూలు జిల్లా ప్రాంతాల్లో ఉన్న పురాతన దేవాలయాలను గుర్తించి అందులో పనిచేస్తున్న అర్చకులకు కూడా ధూపదీప నైవేద్య స్కీమును వర్తింపచేసి ని అర్చకులను ఆదుకోవాలని ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనాము భూములు దేవావయాలలో పూజా కైంకర్యాలు సరిగా జగ లేదని గుర్తించి అటువంటి దేవస్థానాలన్నింటి ధూప దీప నైవేద్య స్కీమును ఏర్పాటు చేసి 5000వేలరూపాయలు ఇచ్చి నిరుపేద అర్చక కుటుంబాల్లో వెలుగులు నిర మధుసూదనశర్మ చేశారు. అలాగే 2019సంవత్సరములో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 10వేల రూపాయలకు పెంచడం జరిగిందని మధుసూదనశర్మ తెలిపారు. అయితే కులాల ప్రాతిపదికన నూతన దేవస్థానాలు పెరిగిపోతున్నందువలన పురాతన దేవస్థానాలకు భక్తులు రావడం తగ్గి అర్చకులకు తగిన జీవనాధారములేక చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని…… కనుక పట్టణ ప్రాంతాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అధికారుల ద్వారా గుర్తించి వెంటనే అర్చక కుటుంబాలను ఆదుకోవాలని మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ కి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎండోమెంట్ పరిధిలోని పెద్ద పెద్ద దేవస్థానాలలో ఖాలీగా ఉన్న 3000 వేల వేద పండితుల ఉద్యోగాలను కూడా భర్తీ చేసి వేదము చదువుకున్న బ్రాహ్మణులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మధుసూదనశర్మ విన్నవించారు.
[zombify_post]