. విజయనగరం.*మండలంలోని సీతానగరంలోగల- శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో గురువారం జరిగిన ముడుపుల పూజలకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.శ్రీలక్ష్మీనరసింహస్వామి
ఆలయంలో తెల్లవారుజామున నుండి సాయత్రం వరకు శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారికి ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు ఆద్వర్యంలో పూజలను నిర్వహించారు. ప్రతీగురువారం శ్రీలక్ష్మి నరసింహస్వామీ దేవాలయంలోజరుగుతున్న ముడుపుల పూజలకు అనూహ్య స్పందనతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలనుండి భక్తులు విచ్చేసి భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో పూజలు చేస్తున్నారు. తొమ్మిది వారాలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ముడుపులు పూజలు పూర్తయ్యాక వారి ఇలవేల్పు ఆలయాలు ఉండే లచ్చయ్యపేట, తోటపల్లి,సింహాచలం,అన్నవరం, చినతిరుపతి,తిరుపతి తదితర దేవాలయాలకువెళ్లి హుండీలో వారి ముడుపులు వేయడం గమనార్హం. ప్రతీ గురువారం జరిగే పూజలకు ఎక్కువ మంది యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో వారిలో భక్తిభావం బాగా పెరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. దీంతోపాటు రెండు నెలల పాటు వారంతా నియమనిష్ఠలతో ఉండటం కూడా గర్వించదగ్గ అంశమేమరి.సీతానగరం మండలం కేంద్రంలో సోమవారం శ్రీసువర్ణముఖేశ్వర స్వామి ఆలయానికి, మంగళవారం హనుమాన్ కూడలి వద్ద ఉన్న
శ్రీఆంజనేయస్వామి ఆలయానికి ,గురువారం శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తజనం రావడంతో మార్కెట్ కూడా కిటకిట లాడుతుంది.
[zombify_post]