విజయనగరం జిల్లా: డలానికి కొత్తగా రెండు జాబితాలో 603 వైఎస్సార్ భరోసా పించన్లు మంజూరు కాగా వాటిని మండల,సచివాలయం అధికారులు పరిశీలించి అప్ లోడ్ చేసాక వాటికి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. దీంతో నియోజక వర్గంలో ఎమ్మెల్యే జోగారావు ప్రారంభం చేయగా, మండలంలో అన్నిగ్రామాల్లో పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కన్వీనర్లు,సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు వైఎస్సార్ భరోసా పింఛన్లు గురువారం పంపిణీ చేశారు. ఇప్పటికే మండలంలోని 10వేల 672 వైఎస్సార్ పాతపింఛన్లు పంపిణి చేయగా,కొత్తగా 603మందికి వివిధ కేటగిరీల వారీగా పింఛన్లు వచ్చినట్లు ఎంపిడిఒ ప్రసాద్ తెలిపారు.గురువారం నాడు ఎంపిపి బలగ రవనమ్మ శ్రీరాములు నాయుడు,జెడ్పీటీసీ మామిడి బాబ్జి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బొంగు చిట్టిరాజులు వారి గ్రామ పంచాయతీలో పింఛన్ల డబ్బులు అందజేసారు.
[zombify_post]