డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
కొత్తపేట మండలం కొత్తపేట గ్రామంలో సచివాలయం 4 పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రతీ గడపకు వెళ్ళి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు అందించిన సంక్షేమ పథకాల వివరాలను వివరించి, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి పరిపాలనను కొత్తపుంతలు తొక్కించారని, వృద్ధులు, వికలాంగులు పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి పోయి వారి గడపలోకే ప్రతీ నెలా 1 వ తేదీన పెన్షన్ అందిస్తున్నారని, గతంలో కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, జనన, మరణ ధ్రువీకరణ తదితర పత్రాలు పొందాలంటే మండల స్థాయి కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది అని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని,ఎలాంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందచేస్తున్నామని,కొత్తపేట గ్రామంలో గడిచిన 4 సంవత్సరాల 6 నెలల కాలంలో బీసీ వర్గాల లబ్ధిదారులకు 30 కోట్ల 45 లక్షల 72 వేల 787 రూపాయలు, ఎస్సి వర్గాల లబ్ధిదారులకు 13 కోట్ల 83 లక్షల 36 వేల 764 రూపాయలు,
ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు 76 లక్షల 22 వేల 871 రూపాయలు,
మైనారిటీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు 2 కోట్ల 73 లక్షల 92 వేల 31 రూపాయలు,
కాపు సామాజిక వర్గానికి చెందిన 27 కోట్ల 3 లక్షల 49 వేల 941 రూపాయలు,
ఇతర సామాజిక వర్గాల లబ్ధిదారులకు 7 కోట్ల 10 లక్షల 20 వేల 93 రూపాయలు కలిపి మొత్తం 81 కోట్ల 92 లక్షల 94 వేల 487 రూపాయలు కేవలం సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిని చేకూర్చారని,
కొత్తపేటలో కౌశిక్ రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించడం జరిగింది అని కొత్తపేట నుండి రావులపాలెం ఆర్ అండ్ బి రోడ్డును నిర్మించామని, కొత్తపేటలో బంగారమ్మ గుడి వద్ద సీసీ రోడ్డు నిర్మించి ఇరువైపులా సీసీ డ్రైన్ నిర్మించుకోవడం జరిగింది అని,
కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను నాడు నేడు కార్యక్రమంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది అని, త్వరలోనే ప్రారంభించడం జరిగింది అని అన్నారు ఇవి కాక ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పనులు చేయడం జరుగుతుంది అని అన్నారు.
[zombify_post]