మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షా శిబిరాల్ని ప్రభుత్వ, పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయడానికి వీల్లేదని…మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షా శిబిరాల్ని ప్రభుత్వ, పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయడానికి వీల్లేదని.. కేవలం ప్రైవేటు స్థలంలోనే పెట్టాలంటూ చీపురుపల్లిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు ఆంక్షలు విధించారు. పార్టీ పిలుపు మేరకు తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో విజయనగరం- పాలకొండ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద రిలే దీక్షలను బుధవారం నుంచి ఏర్పాటు చేయాలని మంగళవారం నిర్ణయించారు. మంగళవారం రాత్రి 10:30 గంటలకు పోలీసులు పట్టణ పార్టీ అధ్యక్షుడు గవిడి నాగరాజుకు ఫోన్ చేసి.. పబ్లిక్ స్థలాల్లో రిలే దీక్షలు ఏర్పాటు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక.. లావేరు రహదారికి ఆనుకుని ఉన్న కిమిడి నాగార్జున మేనమామ భరత్్మహన్ స్థలాన్ని యంత్రంతో శుభ్రం చేయించి దీక్షకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. ఉదయం తెదేపా నాయకులు టెంట్లు వేయిస్తుండగా ఎస్ఐ సన్యాసినాయుడు చేరుకుని, ఈ స్థలం ఇచ్చిన యజమాని నుంచి అనుమతి లేఖను తీసుకుని ఇవ్వాలని సూచించడంతో అవాక్కు అయ్యారు. ఆపై అనుమతి పత్రం తీసుకొచ్చి 20 మంది కంటే ఎక్కువ హాజరు కావడానికిహో మ్సిమళ్లీ లోడ్ చేయండివెల్లదన
[zombify_post]