అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకుగాను మండల తెదేపా అధ్యక్షుడు ఆడిగర్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో నల్ల కండువాలు వేసుకొని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ బాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి 5 రోజులు అవుతున్న నోరు మెదపని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు పుట్టించిందని ఆయన అన్నారు. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు జీతాలు గురించి గానీ, ప్రత్యేక హోదా గురించి గానీ ఏనాడైనా కనీసం మాట్లాడిన దాఖలాలు లేవని ఈసందర్భంగా ఆయన మండిపడ్డారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు చిటికెల సాంబమూర్తి మరియు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]