అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలంలోని దిబ్బపాలెం సచివాలయం పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దిబ్బపాలెం గ్రామ సచివాలయం-1లో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జె.సుధీర్.. పంచాయతీ సెక్రటరీ.రజనీకి మాయమాటలు చెప్పి ఆమె వద్ద వున్న డిజిటల్ కీని డూప్లికేట్ చేసి పలు అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయం బయట పడడంతో విచారణ జరిపిన అధికారులు.. సుధీర్ అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారించారు. అప్పట్లోనే ఇతని సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. కాగా సుధీర్ అక్రమాలకు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు పైల వెంకటలక్ష్మి, జి.రాజేశ్వరి సహకరించినట్టు నిర్ధారణ కావడంతో వీరిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ నుంచి మండల పరిషత్‌కు ఆదేశాలు వచ్చాయి. స్థానిక ఎంపీడీఓ, దిబ్బపాలెం పంచాయతీ సెక్రటరీ, అచ్యుతాపురం సీఐ, పరవాడ డీఎస్పీకి ఉత్తర్వుల కాపీలను అందజేశారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఈ ప్రాంతం విడిచి ఎక్కడకూ వెళ్లకూడదని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులను ఆదేశించారు.
[zombify_post]