హైదరాబాద్: కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన '24 గంటల నిరాహార దీక్ష'ను పోలీసులు భగ్నం చేశారు..
ఈక్రమంలో భాజపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. బుధవారం సాయంత్రం 6గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని, వెంటనే దీక్షా శిబిరం ఖాళీ చేయాలని 6.30గంటల సమయంలో పోలీసులు కిషన్‌డ్డికి సూచించారు. గురువారం ఉదయం 6గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులను హెచ్చరించారు. వెనక్కి తగ్గిన పోలీసులు.. రాత్రి 8గంటల సమయంలో మరోసారి ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కిషన్‌రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరించారు..

[zombify_post]