అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉన్న మన గ్రోమోర్ పశు దాణా విక్రయ కేంద్రాన్ని పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ వి.చిట్టినాయుడు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి, దాణా బస్తాల నాణ్యతను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పశుదాణా చట్టం 2020 ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు షాపులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాణా బస్తాల నుంచి బస్తాలపై ఉన్న మోతాదు ప్రకారం ప్రోటీన్,ఫైబర్,కాల్షియం, ఫాస్పరస్ తేమ శాతం పరిశీలనకు నమూనా సేకరించారు.
[zombify_post]