డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం మండలం, గోపాలపురం గ్రామంలో గోపాలపురం సిద్ధార్థ యూత్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ ఓటు రాజ్యాధికారం అనే అంశంతో మీటింగ్ జరిగింది కావున ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాకా రాజారావు నియోజకవర్గం అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య, నియోజవర్గ కన్వీనర్ కాండ్రు వెంకటేష్ మాట్లాడుతూ నియోజవర్గంలో ఓటు చైతన్యంతో రాజ్యాధికారం సాధించాలి అని అన్నారు..మీటింగ్ తదనంతరం బహుజన సమాజ్ పార్టీలో ఆ గ్రామంలో ఉన్న యువత రొక్కాల ఆనంద్, దగులూరి విజయ్ కుమార్, పీతల విజయ్, చిక్కాల భీమరాజు, అంబటి అర్జున్, మాక రంజిత్, కే కుమార్ చేరారు. వీరిని రాజారావు గారు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు…వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు,రాజ్యాధికారం కొరకు కృషి చేస్తానని అన్నారు..ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు
[zombify_post]