రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి..
వార్త తెలుసుకున్న కుమార్తె గుండెపోటుతో మృతి…
సత్తుపల్లి మండలంలోని న్యాయవాది నివాసంలో తీవ్ర విషాదం..
సత్తుపల్లి మండలం, రేజర్ల పంచాయతీకి చెందిన సీనియర్ న్యాయవాది గొర్ల రామచంద్రారెడ్డి తల్లి రాఘవమ్మ (70) శనివారం సాయంత్రం గం.8.00 సమయంలో గ్రామంలో రోడ్డు దాటుతుండగా అతివేగం, అజాగ్రత్తగా వచ్చిన ద్విచక్ర వాహనం ఒకటి బలంగా ఢీకొన్నది. దీంతో తీవ్ర గాయాల పాలైన రాఘవమ్మను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో కన్ను మూసింది. ఈ సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు సమీపంలోని జగవెల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె నాగమణి(40) గుండెపోటుతో మృతి చెందారు.ఈ సంఘటన వారి నివాసంలోనే కాకుండా గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
[zombify_post]