వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైకాపా స్వర్ణ యుగమేనని కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాల మహిళా విభాగం రీజినల్ కోఆర్డినేటర్ గాజుల శ్వేతా రెడ్డి అన్నారు. శనివారం కౌతాళం మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో వెలిసిన ఈరన్న స్వామిని భర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త కవినాథ్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు . ఈ సందర్భంగా గాజుల శ్వేతా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పాలిట దేవుడన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకాలు అధిక శాతం మహిళల బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు.
ఏ ప్రభుత్వం చేయని విధంగా నేడు వైకాపా ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను అతి తక్కువ కాలంలోనే అమలుపరిచిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. వైకాపా అధికారం వచ్చిన తర్వాత మహిళలకు భరోసా వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా 175 స్థానాలు సాధించడం ఖాయమని దీమ వ్యక్తం చేశారు.
[zombify_post]