in , , , ,

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం

  • చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా దిష్టి బొమ్మ దగ్ధం..
  • సూర్యాపేట జిల్లా టిడిపి ఇన్చార్జి, నియోజకవర్గ బాధ్యులు నాతాల రామ్ రెడ్డి..

మాజీ ముఖ్య మంత్రి  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్టు కు నిరసనగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో సూర్యాపేట జిల్లా టిడిపి ఇన్చార్జి, నియోజకవర్గ బాధ్యులు నాతాల రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని అలాంటి వ్యక్తిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి  కక్షపూరితంగా కేసులు పెట్టి జైలుకు పంపించడం ఆయన పరాకాష్టకు నిదర్శనం అన్నారు. 

జగన్మోహన్ రెడ్డి పులివెందుల రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ మొత్తం పూస్తున్నాడని ఇలాంటి చర్యలకు పాల్పడి జుగుప్సాకర ఆనందం పొందుతున్నారని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. వాజ్ పాయ్ నుంచి మొదలుకొని నరేంద్ర మోడీ వరకు ఉన్న నాయకుల్లో సమకాలికుడు చంద్రబాబు నాయుడు అని అంతటి గొప్ప వ్యక్తిపై న్యాయబద్ధంగా సభ జరుగుతుంటే అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.డి పి పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ ధరావత్ వెంకన్న, కార్యదర్శి నాగయ్య, పార్లమెంట్ మహిళా కార్యదర్శి కారింగుల సైదమ్మ, పట్టణ అధ్యక్షులు గాజుల వెంకన్న, ఏర్పుల లింగయ్య, వీరాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తిని సైదులు, పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమూద్, సూర్యాపేట ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగయ్య, బి హరి, పట్టణ ఉపాధ్యక్షులు నోముల యాదగిరి, పట్టణ కార్యదర్శి నన్నేసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజ్, వేతనాల పెంపుదలకే పోరాడుదాం

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆందోళన