టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. నంద్యాలలో ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం విజయవాడలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు. సుమారు రాత్రి 9 గంటల ప్రయాణం అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సీఐడీ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారికి లేఖ రాశారు. తన తరపు లాయర్లను నలుగురిని ఆఫీసు లోపలికి తరలి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు.కానీ అనంతరం చంద్రబాబును మాత్రమే అధికారులు ప్రశ్నించడం జరిగింది. స్కిల్ డెవలప్ మెంట్ నిధులు మళ్లింపుపై దాదాపు గంటకు పైగా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ క్రమంలో చంద్రబాబు స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు కూడా చేసినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారట. ఇదిలా ఉంటే విజయవాడ సిట్ కార్యాలయానికి యువనేత నారా లోకేష్, భువనేశ్వరి చేరుకోవడం జరిగింది.
[zombify_post]