రొయ్యలు చూస్తే ఎవ్వరికైనా నోరూరక తప్పదు. మత్యరాశులో రొయ్యలకు ఎంత ప్రత్యేక స్థానం ఉందో అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో బొడ్డింగలకు అంతే స్థానం ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో పులస చేపల కోసం మాంస ప్రియలు ఏలా ఎదురుచూస్తారో…. మన్యంలో ని గిరిజనులు కూడ ఈ బొడ్డింగల కోసం అంతే పరితప్పిస్తుంటారు. ఇక్కడ గిరిజనులు బొడ్డింగలను ప్రత్యేక వంటకంగా తయారు చేస్తుకుని ఎంతో ఇష్టంగా తింటారు. రొయ్యలు చెరువులు, గోదావరి, సముద్రం లో దొరికితే… ఈ బొడ్డింగలు మాత్రం ఈత దుబ్బులు వద్ద లభిస్తుంటాయి. ఒక్కొక ఈత దుబ్బు వద్ద ఒకటి లేదా రెండు బొడ్డింగలు మాత్రమే లభిస్తాయి. దీంతో ఈ బొడ్డింగలు సేకరణకు గిరిజనులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈత దుబ్బులని గునపాలతో తవ్వి సేకరిస్తుంటారు. ఇలా సేకరించి న బొడ్డింగలకు మసాలా దట్టించి వండుకు తింటారు. ఇవి రొయ్యల వలే భలే రుచిగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఒక్క సారి ఈ బొడ్డింగలు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలని పిస్తాయని అందుకే వీటిని మన్యం రొయ్యలని పిలుస్తుంటామని స్థానికులు చెబుతున్నారు.
[zombify_post]