పాడేరు: రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఈనెల 10వ తేదీన అరకులోయలో పర్యటిస్తున్నట్టు పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. ఈనెల 10వ తేదీ ఉదయం 10.25 గంటలకు హెలికాప్టర్లో విశాఖ నుంచి బయలుదేరి 11గంటలకు అరకులోయలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని తెలిపారు.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11.30 గంటలకు రైల్వే అతిథి గృహానికి చేరుకొని అక్కడ నుంచి పద్మాపురం గార్డెన్‌కు వెళ్తారన్నారు. అక్కడి ట్రీకాస్టిల్తోపాటు గిరిజన మ్యూజియాన్ని గవర్నర్ సందర్శిస్తారని తెలిపారు. 12.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సుంకరమెట్ట కాఫీతోటలను పరిశీలిస్తారని పీవో పేర్కొన్నారు. అక్కడి నుంచి 1.15 గంటలకు బయలుదేరి అరకు ఏపీటీడీసీ అతిథి గృహానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి 1.50 గంటలకు విశాఖపట్నం తిరుగు ప్రయాణమవుతారని పీవో అభిషేక్ వెల్లడించారు.
[zombify_post]