విషయం :- ప్రతికూల వార్తాకథనంనకు వివరణ తెలియ జేయుట గూర్చి సూచిక:- శ్రీ జిల్లా కలక్టర్ వారి ఆదేశములు తేదీ 08/09/2023
వార్తా కథనం:
సోషల్ మీడియాలో కధనం
ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్యశాఖకు ఆనారోగ్యం,
ఇక్కడ కనిపిస్తుంది చార్జింగ్ పెట్టుకున్న మొబైల్ ఫోన్లు కాదు నిండు ప్రాణాలు. విజయనగరం జిల్లాలో కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రిలో తీసిన చిత్రం. – ఈ ప్రభుత్వానికి గిరిపుత్రుల ప్రాణాలు అక్కర్లేదు కానీ వాళ్ళ ఓట్లు కావాలి?? AP కి ఆరోగ్య శాఖ కి మంత్రి వున్నారా..
సోషల్ మీడియాలో కధనం ననుసరించి కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రి – • విజయనగరం జిల్లా నందు
రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు 1) కొత్తవలస మండలము నందు వున్న కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు 2) దత్తిరాజేరు మండలము నందు వున్న కోరపు కొత్తవలస ప్రాధమిక ఆరోగ్య కేంద్రములు వున్నవి.
> ఈ రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లందు ఎటువంటి గిరిజన గ్రామములు వుండి వుండ లేదు…
ఈ రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లందు గాని, విజయనగరం జిల్లా నందు గల మరి ఎ ఇతర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు గాని ఇటువంటి చికిత్స విధానము చేయరు.
ఈ సంఘటన ప్రస్తుత విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన కాదు.ప్రచురింపబడిన కథనము పూర్తిగా అవాస్తవము అని తెలియ జేయుచుంటిమి .భవదీయ జిల్లా వైధ్య మరియు ఆరోగ్య శాఖాధికారి
[zombify_post]