జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న పట్టణ ఇలావేల్పు దేవత శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారు నిజ శ్రావణమాస నాల్గవ శుక్రవారం పురస్కరించుకుని వివిధ రకాల పండ్లతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమసోత్సవాలలో భాగంగా శుక్రవారాల్లో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులు దర్శించే అవకాశం ఆలయకమిటీ ఏర్పాటుచేసిందని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) తెలుపుతూ సెప్టెంబర్ 15, ఆఖరి శ్రావణ శుక్రవారం మరియు అమావాస్యసందర్భంగా కూరగాయల అలంకరణలో శాకాంబరిగా అమ్మవారి దర్శనం మరియు ఉదయం తొమ్మిది గంటల నుండి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగుతాయని భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.
[zombify_post]