- *ఫేస్ బుక్ లో అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తి ని బైండోవర్ చేసిన కోనరావుపేట పోలీసులు*
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఫేస్ బుక్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు, పోస్టుల పెట్టారన్న ఫిర్యాదు మేరకు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన అంబోజ వెంకటేష్ అను వ్యక్తి ఫేస్ బుక్ లో అనుచిత పోస్టుల పెట్టడంతో వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని స్థానిక తహశీల్దార్ విజయ ప్రకాష్ రావు ముందు బైండ్ ఓవర్ చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాస్వామ్య విధానంలో అందరికీ ఎన్నికలలో పోటీ చేసే అధికారం ఉంటుందని, అట్టి వ్యక్తుల మనోభావాలు, హక్కులు కించపరిచే విధంగా ఎవరైన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేసి నట్లైతే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ ఎస్సై పేర్కొన్నారు..
[zombify_post]