తాను ఎక్కిన బస్సు కింద పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సీతంపేట మండంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సీతంపేట మండలం తుమ్మన కాలనీ గ్రామానికి చెందిన ఆరిక సింధు (45) అనే గిరిజనుడు కొత్తూరుకు ఓ పని నిమిత్తం వెళ్లాడు. పని ముగిసిన తర్వాత కొత్తూరులో ఆర్టీసీ బస్సు ఎక్కి పులిపుట్టి గ్రామంలో బస్సు దిగాడు. ఈలోగా బస్సు ముందుభాగం వైపు వెళ్లడంతో బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
[zombify_post]