– జాబ్ రిజిస్ట్రేషన్, పర్మినెంట్ ఐడి కొరకు రూ.2000, 3000 వసూలు చేస్తున్న ఆన్లైన్ కేటుగాళ్లు.
– మోసపోయామని తెలిసిన అనంతరం కక్కలేక మింగలేక బాధితుల అవస్థలు.
ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు కోవిడ్ అనంతరం ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా మారడంతో ఎంతోమంది నిరుద్యోగులు, గృహిణు లు ఉద్యోగ ప్రకటనలు అది కూడా వర్క్ ఫ్రం హోం కొరకు వేచి చూస్తున్నారు. సరిగ్గా దీనిని ఆసరాగా తీసుకొని ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పలు యాప్లు మరియు సోషల్ మీడియా వేదికగా రూ.15 నుండి 30,000/- వేతనం చెల్లిస్తామంటూ ఇంటి దగ్గర ఉంటూ పని చేయాల్సి ఉంటుందని ఆకర్షణ నియమైన ప్రకటనలు ఇస్తున్నారు. మరి కొన్ని పత్రికల్లో కూడా ఈ విధమైన ప్రకటనలు వస్తుండడంతో అది చూసి యువత ఆశగా సంబంధిత నెంబర్ కు ఉద్యోగ అవకాశం కోసం ఫోన్ చేస్తున్నారు. పెన్సిల్, పెన్స్ ప్యాకింగ్, జాబ్స్ అని, చాక్లెట్ ప్యాకింగ్ జాబ్స్, రికార్డులు రాయడం అని, రకరకాల అవకాశాలు ఉన్నాయని అయితే జాబ్ రిజిస్ట్రేషన్, పర్మినెంట్ ఐడి కొరకు రూ 2000,3000 చెల్లించాల్సి ఉంటుందని తెలుపుతున్నట్లు సమాచారం అందుతుంది.మరీ ముఖ్యంగా నమ్మబలుకుట కొరకు దేశ నాయకులు,స్వాతంత్ర సమరయోధుల పేర్లతో స్వచ్ఛంద సంస్థల పేర్లు పెట్టుకుని ప్రకటనలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆనందంగా వెంటనే అప్పు చేసి మరీ సంబంధిత నెంబర్లకు నగదు జమ చేస్తున్నారు. తీరా ఉద్యోగం లేదు ఏమీ లేదు ఇదంతా మోసం అన్ని తెలిశాక కక్కలేక మింగలేక లబోదిబోమంటున్నారు. ఆన్లైన్ కేటుగాళ్ల ప్రకటనల్లో చూసి దగా పడుతున్న నిరుద్యోగులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. వీరి ఆగడాలను పోలీసులు దృష్టి సారించి అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
[zombify_post]