నేరగాళ్ళతో రాజకీయనాయకులు మమేకమైతే ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడతారో
ఇతని జీవితమే ఒక చక్కని ఉదాహరణ..1979 సంవత్సరం కర్ణాటకలోని ఉడిపి జిల్లా, కర్కల తాలూకాలోని ఎన్నహోల్ గ్రామం.12 సంవత్సరాల పిల్లాడితో అతని తండ్రి "బాబూ మన కుటుంబ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఏదైనా పనిలో చేరి ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తే నాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది.." అన్నాడు.అప్పుడే 7వ తరగతి పాస్ అయ్యి ఉన్నాడు ఆ పిల్లాడు.చదవాలని ఉన్నా తప్పని పరిస్థితులలో బొంబాయి బయలుదేరాడు.అక్కడ ఒక కాకా హోటల్‌లో బాయ్‌గా చేరాడు. పగలు పని, నైట్ వరండాలో నిద్ర.అయినా చదవాలని కోరిక..పాత పుస్తకాలు కొనుక్కుని హోటల్ ముగిసిన తరువాత రాత్రి సమయంలో చదువుతూ ప్రైవేట్‌గా 10th పాస్ అయ్యాడు.అలా చదువుకొంటూ 8 సంవత్సరాలు గడిచే లోపల DN నగర్‌లోని CES కాలేజీ నుండి పట్టా పొందాడు.తను ముంబయి వచ్చినప్పటి నుండి గ్యాంగస్టర్ల ఆగడాలను చూస్తూ వున్నాడు.తను హోటల్ బాయ్ కాబట్టి వారి ఆగడాలను మరింత దగ్గర నుంచి పరిశీలించాడు.ఎలాగైనా తను పోలీస్ అయ్యి వారి అంతు చూడాలని అతని కోరిక.అందుకే పట్టుదలగా చదివి 1995లో SI గా సెలెక్ట్ అయి శిక్షణ పూర్తి కాగానే 1996లో జూహు పోలీసుస్టేషన్లో SI గా బాధ్యతలు తీసుకొన్నాడు..చేరిన 3 నెలలకే ఒకరోజు రాత్రి ఇద్దరు కరుడుకట్టిన గ్యాంగస్టర్స్‌ను ఎన్కౌంటర్‌లో కాల్చిచంపాడు.వెంటనే అతనిని ఏంటీ డికాయిట్ టీమ్‌లోనికి తీసుకొన్నారు.1997లో గ్యాంగస్టర్స్‌ను ఎదురుకొనే సమయంలో తీవ్రగాయాలై చావు అంచుల దాకా వెళ్ళాడు.ఇలా 2004 దాకా చోటా రాజన్, చోటా షకీల్ గ్యాంగ్‌లకు సంబందించిన 83 మంది గ్యాంగస్టర్లను కాల్చి చంపి డాన్‌లకు సింహస్వప్నం అయినాడు.ఇంతలోనే మహారాష్ట్ర హోమ్ మంత్రిగా దావూద్ గ్యాంగ్‌తో (D గ్యాంగ్) మంచి సంబంధాలున్న RR పాటిల్ రావడంతో అతనికి కష్టాలు ప్రారంభమైనాయి.అతని శత్రువులు అతనిపై దాడులు మొదలుపెట్టారు.అతని సబార్డినేట్స్ అతని మాట వినడం మానేశారు.అతనితో స్నేహంగా ఉన్న కేతాన్ తిరోత్కర్ అనే జర్నలిస్ట్, అతనికి అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొన్నాడని ఆరోపించడంతో అతని పై mcoca కోర్టు విచారణ మొదలుపెట్టింది.ఏసీపీ శంకర్ కాంబ్లీ, డీసీపీ KL బిష్ణునోయ్, ఏసీపీ దిలీప్ సవంత్ ఆధ్వర్యంలో అతనిపై వచ్చిన ఆరోపణలు, ఎన్కౌంటర్‌లపై విచారణలలో క్లీన్ చిట్ ఇవ్వబడింది. జర్నలిస్ట్ కేతన్ తిరోత్కర్ అండర్ వరల్డ్ వ్యక్తులతో సంబంధాలున్నాయని రుజువు కావడంతో అరెస్ట్ చేయబడ్డాడు.అయినా SI ను శత్రువులు వదలలేదు.మళ్ళీ అతని మీద కక్షలు మొదలుపెట్టారు.మళ్ళీ 2006లో అతని మీద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ACP బీమ్ రావు ఘడ్కే నేత్రుత్వంలో అరెస్ట్ చేయడం జరిగింది.అతను తన గ్రామంలో తన తల్లి మీద విరాళాలతో కట్టించిన రాధా నాయక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది.15 రోజులు పోలీస్ కస్టడీ, 45 రోజులు జ్యూడిషల్ కస్టడీలో గడిపాడు. అయితే ఎటువంటి సాక్షాలు లేనందున నిర్దోషిగా విడుదలయినాడు.అయినా శత్రువులు వదలలేదు.అతనిపై మనీలాండరింగ్ కేసులు పెట్టి 62 రోజులు జైలుకు పంపారు.అతను జైలులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు.అతను మహారాష్ట్ర మానవహక్కుల కమీషన్‌కు పిర్యాదు చేయడంతో కేసు విచారించిన జడ్జ్ అతన్ని కావాలనే అరెస్ట్ చేసారని దానికి కారణమైన ప్రద్న్య సవరదే పై మండిపడింది.ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఆమె నుండి ₹25000 వసూలు చేసి SI కి ఇవ్వాలని తీర్పు చెప్పింది.విడుదలైన తరువాత తను స్థాపించిన పాఠశాల లేవాదేవిలన్నీ చెక్‌ల రూపంలో జరిగాయని అవన్నీ విరాళాలు అని నిరూపించాడు.ఇలా ఒక నిజాయితీపరుడైన ఉద్యోగిని వివిధ కేసులతో నరకయాతనకు గురిచేసారు. ఒక్క అవినీతి కేసులే 27.ఇవన్నీ కొట్టివేయడం జరిగింది. ఒక్క కేసు కూడా నిరూపణ కాలేదు.ఇంతకీ ఈ పోలీస్ ఇన్సపెక్టర్ ఎవరో తెలుసా..?? దయానాయక్.దాదాపు 8 సంవత్సరాలు ముంబాయ్ అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోలీస్ ఆఫీసర్.ఇతని మీద సినిమాలు కూడా వచ్చాయి. .హిందీలోనూ 3 సినిమాలు తీశారు..
[zombify_post]